లేటెస్ట్..”భోళా శంకర్” లో ఈ యంగ్ హీరో.!

Published on Mar 18, 2023 11:00 am IST

లేటెస్ట్ గా మెగా మాస్ బ్లాక్ బస్టర్ హిట్ “వాల్తేరు వీరయ్య” తో మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో మరో సెన్సేషనల్ హిట్ ని తన ఖాతాలో వేసుకోగా ఇక నెక్స్ట్ మెగాస్టార్ చేస్తున్న మరో మాస్ చిత్రం “భోళా శంకర్” కోసం అంతా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాని దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో చిరు తో పాటుగా మరింత ఇంట్రెస్టింగ్ క్యాస్టింగ్ ఉంది. మరి ఈ సినిమాలో లేటెస్ట్ గా అయితే మరో యంగ్ హీరో సుశాంత్ నటిస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

ఈరోజు సుశాంత్ బర్త్ డే కానుకగా మేకర్స్ అయితే బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఈ సినిమాలో యంగ్ హీరో ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సినిమాలో తాను ఎలాంటి రోల్ చేయనున్నాడో చూడాలి. మరి ఈ సినిమాలో అయితే తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరు చెల్లెలి పాత్రలో నటిస్తుంది. అలాగే మహతి సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :