తన సినిమా రిలీజ్ రోజున పవన్ సినిమాకే వెళ్తా అంటున్న యంగ్ హీరో!

Published on Feb 2, 2022 8:03 am IST


టాలీవుడ్ లో సినిమాల నడుమ ఎప్పుడూ కూడా పోటీ వాతావరణం ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి కంటెంట్ బాగుంటే అవతల ఎలాంటి సినిమాలు ఉన్నా కూడా పలు సినిమాలు ఒకే డేట్ కి రావడానికి ఎంతమాత్రం వెనుకాడవు. ఇక ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ డేట్ ల పర్వం స్టార్ట్ అయ్యింది. దీనితో ఒక్కో సినిమా రిలీజ్ డేట్ లు మారి ఫైనల్ అవుతూ వస్తున్నాయి.

ఇక ఇదిలా ఉండగా ఈ లిస్ట్ లో మన టాలీవుడ్ లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం నటించిన తాజా సినిమా “సెబాస్టియన్ పి సి 524” ని వచ్చే ఫిబ్రవరి 25కి రిలీజ్ చెయ్యడానికి ఫిక్స్ చేసాడు. మరి ఈ సినిమా రిలీజ్ రోజునే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “భీమ్లా నాయక్” కూడా రెడీగా ఉంది. మరి ఈ సినిమాతో పోటీకి పవన్ అభిమాని అయ్యిన నువ్ ఎలా వస్తావని పవన్ అభిమానులు అడగ్గా..

నేను మీకంటే ఒకింత ఎక్కువ భీమ్లా నాయక్ కోసం ఎదురు చూస్తున్నానని, ఆరోజు తన సినిమా రిలీజ్ అయ్యినా కూడా నేను పవన్ కళ్యాణ్ సినిమాకే మొదటి షో వెళతానని ఫస్ట్ షో రచ్చ ఆయన మూవీ తోనే అని ఊహించని పక్కా ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు. దీనితో ఈ రిప్లై పవన్ అభిమానుల్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. మరి అయినా భీమ్లా నాయక్ ఆరోజే వస్తుంది అని అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

సంబంధిత సమాచారం :