చైతు నెక్స్ట్ లో ఈ యంగ్ హీరోయిన్ ఫిక్స్.!

Published on Jun 23, 2022 10:00 am IST

అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా ఇప్పుడు పలు టాలీవుడ్ సినిమాలతో పాటుగా హిందీలో చేసిన సినిమా కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే చైతు లైనప్ లో రీసెంట్ గా కోలీవుడ్ కి చెందిన ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు కూడా లైన్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కాంబోలో నాగ చైతన్య 22వ సినిమా చేయబోతున్నారు.

అయితే ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు. ఈ చిత్రంలో హీరోయిన్ యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ కృతి శెట్టి ని ఎంపిక చేసినట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేశారు. దీనితో కాంబో నుంచి మరో సినిమా రాబోతుంది అని చెప్పాలి. ఈ ఏడాదిలోనే ఈ ఇద్దరు హీరో హీరోయిన్ లు నటించిన “బంగార్రాజు” ఎంత పెద్ద హిట్ అయ్యిందో చూసాము. మరి ఈ సినిమాకి ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :