‘శర్వా 37’ లోకి యంగ్ హీరోయిన్ ఎంట్రీ.!

‘శర్వా 37’ లోకి యంగ్ హీరోయిన్ ఎంట్రీ.!

Published on Jun 19, 2024 1:00 PM IST

యంగ్ హీరో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన రీసెంట్ చిత్రం “మనమే” తో పలకరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత శర్వానంద్ తన కెరీర్ 37వ సినిమాలో బిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమాని రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు.

ఈ సినిమా హీరోయిన్ ని పరిచయం చేస్తూ యంగ్ హీరోయిన్ సాక్షి వైద్యని పరిచయం చేశారు. మరి ఈ సినిమాలో ఈమె నిత్యాగా కనిపించనుంది అని డీసెంట్ లుక్స్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఇందులో ఈమె చాలా అందంగా కనిపిస్తూ ఆకట్టుకునేలా ఉంది. మరి ఈ సినిమాలో ఈమె ఎలాంటి పెర్ఫామెన్స్ ని అందించనుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు