తొలిప్రేమ ఆడియో విడుదల తేది ఖరారు !

18th, January 2018 - 11:43:46 AM

వ‌రుణ్ తేజ్‌, రాశి ఖ‌న్నా జంట‌గా ‘తొలి ప్రేమ‌’ సినిమా ద్వారా వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడిగా పరిచయం కానున్నారు. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్ లో బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతం అందించాడు. ఈ నెల 20న తొలిప్రేమ సినిమా ఆడియో విడుదల కానుంది.

ఇటీవ‌ల విడుద‌లైన ”నిన్నిలా నిన్నిలా చూశానే.. క‌ళ్ళ‌ల్లో క‌ళ్ళ‌ల్లో దాచానే.. రెప్ప‌లే వేయ‌నంత క‌నుల‌పండ‌గే..నిన్నిలా నిన్నిలా చూశానే.. అంటూ సాగే సాంగ్ కు మంచి స్పందన లభించింది. లవ్ స్టొరీ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాతో వరుణ్ తేజ్ మంచి విజయం అందుకుంటాడని ఆశిద్దాం. ఫిబ్రవరి 9న ఈ మూవీ విడుదల కానుంది.