అజిత్ – విజయ్ మల్టీస్టారర్ పై అవి రూమర్స్ మాత్రమే.!

Published on Jun 21, 2022 10:05 am IST


సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఉన్న బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో తమిళ్ స్టార్ లు అజిత్ కుమార్ మరియు తలపతి విజయ్ లు కూడా ఒకరు. మన దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబులు ఎలాగో అక్కడ కూడా ఈ స్టార్స్ అలాగే. మరి ఇలాంటి స్టార్స్ కలిపి ఓ సినిమా ఈ టైం లో చేస్తే ఎలా ఉంటుంది అనేది ఊహకి కూడా అందదు. అయితే ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది పక్కన పెడితే..

గత కొన్నాళ్ల కితం ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు అజిత్ – విజయ్ ల కోసం ఓ కథ నా దగ్గర ఉంది అది వారికి చెప్పి సినిమా చేస్తానని చెప్పడం వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు దీనికి అదనంగా త్వరలోనే ఈ సినిమాపై ప్రకటన ఉంటుంది అని అది పాన్ ఇండియా లెవెల్లో సినిమా ఉంటుంది అని మరిన్ని రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం మొదలయ్యాయి. మరి వీటిపై అయితే విశ్లేషకుల నుంచి క్లారిటీ తెలుస్తుంది. ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని ఈ కాంబోపై ఎలాంటి నిజం లేదని చెబుతున్నారు.

సంబంధిత సమాచారం :