నాగ్ అవైటెడ్ ప్రాజెక్ట్ “గోస్ట్” పై అవి పక్కా రూమర్స్ మాత్రమేనట.!

Published on Jul 7, 2022 3:40 pm IST


టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హీరో గా నటుస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “గోస్ట్”. బంగార్రాజు సినిమాతో అదిరే కం బ్యాక్ ఇచ్చిన అక్కినేని నాగార్జున గోస్ట్ తో ఖచ్చితంగా మరో హిట్ అందుకుంటాడని అభిమానులు సహా చిత్ర యూనిట్ నమ్మకంగా ఉన్నారు. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ ఈరోజే ఒక సాలిడ్ అప్డేట్ ని కూడా అందించగా ఈ సినిమాపై గత కొన్ని రోజులు నుంచి ఊహించని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ చిత్రాన్ని మేకర్స్ నేరుగా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారని టాక్ వస్తుండగా చిత్ర యూనిట్ నుంచి అయితే ఈ టాక్ లో ఎలాంటి నిజం లేదని మొదట థియేటర్లు లోనే రిలీజ్ అవ్వనున్నట్టు తెలుపుతున్నారట. దీనితో ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని కన్ఫర్మ్ అయ్యింది. అలాగే రేపు జూలై 9న రాబోతున్న అప్డేట్ తో కూడా థియేట్రికల్ రిలీజ్ పై కన్ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి శ్రీనివాస సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :