“బ్రహ్మాస్త్ర” ముందు నిలవలేక పోయిన వారి నెగిటివ్ అస్త్ర.!

Published on Sep 6, 2022 6:03 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ మొత్తంలో అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న అవైటెడ్ చిత్రం “బ్రహ్మాస్త్ర”. బాలీవుడ్ నుంచి చాలా కాలం తర్వాత అన్ని భాషల్లో ముఖ్యంగా మన తెలుగులో కూడా మంచి అంచనాలు సెట్ చేసుకున్న చిత్రంగా ఇది నిలిచింది. బాలీవుడ్ స్టార్ నటులు రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా నటించగా అయాన్ ముఖర్జీ ఈ సినిమాని తెరకెక్కించారు.

అయితే అస్త్రవర్స్ అంటూ తీసిన ఈ సినిమాపై కూడా బాలీవుడ్ లో కొందరు భారీ ఎత్తున నెగిటివ్ ట్రెండ్ ని అయితే స్టార్ట్ చేశారు. సినిమాని బాయ్ కాట్ చెయ్యాలి అంటూ కొన్ని రోజులు నుంచి బాలీవుడ్ లో ట్రెండ్ చేస్తుండగా వాళ్లకి షాకిచ్చేలా ఈ సినిమా బుకింగ్స్ ఇప్పుడు మరో స్థాయిలో నమోదు అవుతుండడం ఆసక్తిగా మారింది. దీనితో వాళ్ళ బాయ్ కాట్ అస్త్ర మాత్రం “బ్రహ్మాస్త్ర” ముందు నిలవలేకపోయింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :