ఆ వార్తల్లో నిజం లేదు …. క్లారిటీ ఇచ్చిన కరీనా కపూర్ … !!

Published on Aug 4, 2022 5:41 pm IST

బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ప్రస్తుతం అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన భారీ మూవీ లాల్ సింగ్ చడ్డా లో హీరోయిన్ గా నటించారు. ఆగష్టు 11 న ఈ మూవీ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవడంతో ఇటీవల మీడియా వారితో సినిమాకి సంబదించిన పలు విషయాలు పంచుకున్న కరీనా కపూర్, కొద్దిరోజులుగా తనపై ప్రచారం అవుతున్న ఒక రూమర్ పై కూడా స్పందించారు. త్వరలో అత్యంత భారీగా తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక మూవీ రామాయణంలో నటించేందుకు మీరు దాదాపుగా రూ.12 కోట్ల వరకు డిమాండ్ చేశారట నిజమేనా అంటూ ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కరీనా ఈ విధంగా బదులిచ్చారు.,

నిజానికి తాను ఎక్కువగా మీడియా ముందుకి రానని, అలానే తన టైం మొత్తం కుటుంబంతో గడపడంతోనే సరిపోతుందని, మధ్యలో ఇటువంటి పుకార్లు ప్రచారం అయితే అసలు వాటికి సమాధానం ఇవ్వాలా లేదా అనేది కూడా ఇబ్బందికరంగా మారిందని అన్నారు. నిజానికి రామాయణం మూవీ టీమ్ వారి నుండి తన వద్దకు ఏ రోల్ గురించి ఇప్పటివరకు ఎటువంటి ప్రపోజల్ రాలేదని,అటువంటపుడు నేను అంత భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసానని ఎవరైనా ఎలా రాస్తారని అన్నారు. ఇటీవల సోషల్ మీడియా వినియోగం ఎక్కువయ్యాక ఎవరికి తోచిన విధంగా వారు రాస్తున్నారని, దయచేసి రాసేటపుడు అందులో ఎంతవరకు వాస్తవం ఉండి ఉండవచ్చు అనే ఆలోచన చేసి రాస్తే బాగుంటుందని క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :