‘సలార్’ రిలీజ్ కోసం పరిశీలనలో ఆ మూడు డేట్స్ ?

Published on Sep 14, 2023 12:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీ సలార్. ఈ మూవీని హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. వాస్తవానికి సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ మూవీని కొన్ని అనుకోని కారణాల వలన కొన్నాళ్ల పాటు వాయిదా వేస్తున్నట్లు నేడు మేకర్స్ ప్రకటించారు.

అయితే సలార్ కోసం మేకర్స్ మూడు రిలీజ్ డేట్స్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. దాని ప్రకారం సలార్ ని నవంబర్ 10, డిసెంబర్ 20, జనవరి 12 లలో ఏదో ఒకటి ఫైనల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి పక్కాగా సలార్ రిలీజ్ డేట్ అప్పుడు ఫైనలైజ్ అవుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. జగపతి బాబు, ఈశ్వరి రావు, శ్రియ రెడ్డి, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీలో కీలక పాత్రలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :