“ధమాకా”లో వారిద్దరి ట్రాక్ హైలైట్.!

“ధమాకా”లో వారిద్దరి ట్రాక్ హైలైట్.!

Published on Dec 18, 2022 2:00 PM IST

మన టాలీవుడ్ లో మోస్ట్ ఎనర్జిటిక్ స్టార్ హీరోస్ లో ఒకరైన మాస్ మహారాజ రవితేజ ఈ ఏడాది తన మూడో సినిమా రిలీజ్ తో అయితే రెడీగా ఉన్నారు. మరి వరుస విజయ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ చిత్రమే “ధమాకా”. మరి ఈ చిత్రంపై మంచి అంచనాలు ఇప్పుడు నెలకొనగా ఈ సినిమాపై అయితే దర్శకుడు లేటెస్ట్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

త్రినాథరావు గత సినిమాలు చూస్తే డెఫినెట్ గా మంచి ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది. ఈ అంశం మాత్రం తన సినిమాల్లో ఎక్కడా డిజప్పాయింట్ చెయ్యలేదు. మరి ఇదే పాయింట్ ఈ సినిమాలో హైలైట్ ట్రాక్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో వెర్సటైల్ నటుడు రావు రమేష్ అలాగే ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది లు నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరి ఈ ఇద్దరి మధ్య ఉన్న కామెడీ ట్రాక్ సినిమాలో రవితేజ తర్వాత బిగ్గెస్ట్ హైలైట్ గా నిలుస్తుంది అని తెలిపారు. రీసెంట్ గానే రవితేజ కూడా ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా రాగా అందులో కూడా తాను ఆది ధమాకా మంచి పాత్ర చేస్తున్నట్టుగా మెన్షన్ చేశారు. మరి సినిమాలో అయితే వారి ట్రాక్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ డిసెంబర్ 23 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు