SSMB 28 : టైటిల్ గా అవేవీ కావట ?

Published on May 30, 2023 8:12 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తీస్తున్న ప్రతిష్టాత్మక SSMB 28 మూవీ పై అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. దాదాపుగా పన్నెండేళ్ల విరామం తరువాత మహేష్ బాబు తో త్రివిక్రమ్ తీస్తున్న ఈ మూవీ యొక్క టైటిల్ తో పాటు ఫస్ట్ స్ట్రైక్ గ్లింప్స్ ని రేపు సాయంత్రం 6 గం. 3 ని. లకు కృష్ణ గారి మోసగాళ్లకు మోసగాడు మూవీ ప్రదర్శితం అవుతున్న థియేటర్స్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు ఈ మూవీకి గుంటూరు కారం, అమరావతికి అటు ఇటు, అయోధ్యలో అర్జునుడు, ఊరికి మొనగాడు ఇలా పలు టైటిల్స్ కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్నాయి.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం SSMB 28 మూవీకి అసలు ప్రచారంలో ఉన్న ఈ టైటిల్స్ ఏవి కాకుండా ఒక సరికొత్త టైటిల్ ని మేకర్స్ సెలెక్ట్ చేసినట్లు చెప్తున్నారు. మరి మొత్తంగా ఈ మూవీకి టైటిల్ గా ఏది ఫిక్స్ అవుతుందో తెలియాలి అంటే మరొక్క రోజు వెయిట్ చేయాల్సిందే. శ్రీలీల, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2024 జనవరి 13న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :