నాని ‘దసరా’ లో హైలైట్ ఎపిసోడ్స్ అవే ?

Published on Mar 11, 2023 3:00 am IST

నాచురల్ స్టార్ నానితో యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇక దసరా మూవీ పై నాని ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పాటలు, ప్రచార చిత్రాలు అందరినీ ఆకట్టుకుని మరింత హైప్ ఏర్పరిచాయి.

అయితే విషయం ఏమిటంటే దసరా మూవీలో మాస్ యాక్షన్ అంశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయని, మరీ ముఖ్యంగా ఈ మూవీలో ఇంటర్వెల్ ఫైట్ తో పాటు క్లైమాక్స్ ఫైట్ కూడా అదిరిపోనున్నాయని లేటెస్ట్ టాలీవుడ్ బజ్. అలానే మొత్తంగా మూడు యాక్షన్ బ్లాక్స్ ఉన్న ఈ మూవీ తప్పకుండా ఆడియన్స్ ని నాని ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా దసరా మూవీని పలు భాషల్లో మార్చి 30న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :