ఓటిటి సమీక్ష: ‘తొవ్వ’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

Thovva

విడుదల తేదీ : జనవరి 04, 2025
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : మాస్టర్ భాను ప్రకాష్, పూర్ణ చంద్ర, మౌనిక తదితరులు
దర్శకత్వం : పంచిక రాహుల్
నిర్మాత : పంచిక రాహుల్
సంగీతం : వివేక్ సాగర్
ఛాయాగ్రహణం : విజయ్ కుమార్
కూర్పు : రూపక్ రోనాల్డ్సన్

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

ఈ వారం మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన తాజా లఘు చిత్రమే ‘తొవ్వ’. వీక్లీ సిరీస్ గా ప్రసారం అవుతున్న కథా సుధ నుంచి వచ్చిన ఈ కొత్త చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

తెలంగాణాలో ఒక చిన్న గ్రామానికి చెందిన పిల్లాడు జై (మాస్టర్ భాను ప్రకాష్) కి సైకిల్ తొక్కడం అంటే ఎంతో ఇష్టం తన తండ్రి ప్రసాద్ (పూర్ణ చంద్ర) ఆటో నడుపుతూ తమ చిన్న కుటుంబాన్ని సాకుతాడు. అయితే ఓరోజు తన ఫ్రెండ్ తొక్కేందుకు సైకిల్ ఇవ్వలేదని జై అద్దెకి సైకిల్ తీసుకొని తొక్కుకోవాలి అని ఆ 3 రూపాయల కోసం తన తల్లిదండ్రులు దగ్గర బాగా పట్టుబడతాడు. బాగా చదువుకోమని చెప్పే తన తండ్రే నేను డబ్బులు ఇవ్వను నీ తెలివి వాడి 3 రూపాయలు సంపాదించి సైకిల్ అద్దెకి తీసుకో అని చిన్న సవాల్ లా ఇస్తాడు. మరి ఆ 3 రూపాయల కోసం జై ఎలాంటి దారి(తొవ్వ) ఎంచుకున్నాడు? ఎలా ఆ డబ్బు సంపాదించుకున్నాడు? అప్పటికి తన పంతం నెగ్గించుకున్నాడా లేదా? ఇందులో ఇచ్చిన సందేశం ఏంటి అనేది తెలియాలి అంటే ఈ లఘు చిత్రం చూసే తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఇటీవల కాలంలో వచ్చిన ఒక డీసెంట్ విలేజ్ డ్రామాస్ లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు. కొంచెం స్లోగా ఉన్నప్పటికీ ఇందులో కంటెంట్ మాత్రం ఆకట్టుకునే విధంగానే ఉంది. పిల్లలు స్కూల్ సమయం నుంచే ఎలా ఎదగాలి తమ తెలివికి పదును పెడితే కేవలం బడిలో చెప్పే చదువు మాత్రమే కాకుండా స్వతంత్రంగా ఎలా ఆలోచించాలి అనే సందేశాన్ని చెప్పడం బాగుంది.

ఈ క్రమంలో నీట్ కాస్టింగ్ మంచి పాటలు, నేపథ్య గీతం కొంచెం ఆహ్లాదంగా అనిపిస్తాయి. ఇవి పక్కన పెడితే మాస్టర్ భాను తన రోల్ లో బాగా చేసేసాడు. తనపై కామెడీ సీన్స్ బాగున్నాయి. తనకి తల్లిదండ్రలుగా చేసిన పూర్ణ చంద్ర, మౌనికలు పల్లెటూరి జంటగా బాగా చేశారు. వీరితో పాటుగా ఇతర నటీనటులు, బాల నటులు బాగా చేశారు. అంతే కాకుండా ఇందులో పాటలు కూడా బాగున్నాయి. వివేక్ సాగర్ స్టైల్ తెలిసినవారు అయితే తన వర్క్ అని యిట్టె కనిపెట్టేస్తారు.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో కంటెంట్ డీసెంట్ గానే ఉంది, కానీ కేవలం 27 నిమిషాల సినిమాలో కూడా కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అంతా చాలా సింపుల్ గానే వెళుతూ స్లోగా నడుస్తున్న భావన కలుగుతుంది. ఇందులో ప్రధాన సందేశం ఏంటి అనేది తెలుసుకోవడానికి జరిగిన ప్రయాణం కొంచెం ఫాస్ట్ గా ఉంటే ఇంకా బాగుండేది. అలాగే క్లైమాక్స్ లో కొంచెం డిటైలింగ్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. జై అనుకున్నది సాధించే క్రమంలో పరిస్థితిని ఇంకొంచెం బాగా తీయాల్సింది.

సాంకేతిక వర్గం:

ఈ లఘు చిత్రంలో నిర్మాణ విలువలు అంతా చాలా క్లీన్ గా ఉన్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ కి కావాల్సిన సెటప్ అంతా బాగుంది. ఇందుకు తగ్గ విజువల్స్ ని మంచి టోన్ తో సహజమైన సన్నివేశాలు కనిపించే విధంగా విజయ్ కుమార్ అందించారు. అలాగే వివేక్ సాగర్ బ్యూటిఫుల్ మ్యూజిక్ కూడా ఇందులో రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. రూపక్ రోనాల్డ్సన్ ఎడిటింగ్ బాగానే ఉంది కానీ కొంచెం బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు పంచిక రాహుల్ విషయానికి వస్తే.. రచయిత జార్జ్ సంతాయన రచన ఆధారంగా డిజైన్ చేసుకున్న ఈ సినిమా డీసెంట్ గా అనిపిస్తుంది. మంచి పరిస్థితులు క్రియేట్ చేసుకుని చెప్పాలనుకున్న సందేశాన్ని అందించారు. కాకపోతే ఇది చాలా సింపుల్ అండ్ స్లోగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఇది తప్పితే తన వర్క్ ఈ సినిమాకి బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘తొవ్వ’ అనే లఘు చిత్రంలో నటీనటులు డీసెంట్ పెర్ఫామెన్స్ లు సెటప్ అంతా బాగుంది. అలాగే ఇందులో సందేశం కూడా నీట్ గా అనిపిస్తుంది. కాకపోతే కథనం చాలా సింపుల్ గానే వెళ్ళిపోతుంది. పైగా కొంచెం స్లో కూడా అనిపిస్తుంది. ఇది పక్కన పెడితే ఈ లఘు చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ కి నచ్చుతుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Exit mobile version