నెల రోజుల వ్యవధిలో మూడు బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ తో రానున్న మెగా ఫ్యామిలీ హీరోస్

Published on Jun 8, 2023 3:00 am IST

ప్రస్తుతం మెగా ఫ్యామిలీ లోని హీరోస్ అందరూ కూడా వరుసగా ప్రాజక్ట్స్ తో త్వరలో ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ముందుగా జూలై 28, 2023 నుండి మెగా అభిమానులకు ట్రీట్ టైమ్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజున పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ల బ్రో థియేటర్లలో విడుదల కానుంది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా వినోదయ సిత్తమ్ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కుతోంది.

ఇక ఈ ఇద్దరు హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడాలని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బ్రో విడుదలైన రెండు వారాల తర్వాత, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నా భోళా శంకర్ ఆగస్టు 11, 2023న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇది కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోంది. కాగా ఇది తలా అజిత్ కుమార్ నటించిన వేదాళం కి అధికారిక రీమేక్. ఈ మూవీకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇందులో మెగాస్టార్ చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపించనున్నారు.

ఇక భోళా శంకర్ విడుదలైన రెండు వారాల తర్వాత వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున ఆగష్టు 25, 2023న థియేటర్స్ లో విడుదల కానుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచ సమస్య ఆధారంగా రూపొందించబడింది మరియు యాక్షన్‌ ఎంటర్టైనర్ గా సాగుతుంది. ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఈ స్పై థ్రిల్లర్ విజయం వరుణ్‌కి చాలా అవసరం. మొత్తానికి మెగా అభిమానులు నెల రోజుల వ్యవధిలో మూడు ట్రీట్స్ ని అందుకోనున్నారు. మరి ఈ సినిమాలు ఎంతమేర ఆడియన్స్ ని మెగా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం :