ఏప్రిల్ 14 కి మొత్తం మూడు భారీ చిత్రాలు..!

ఏప్రిల్ 14 కి మొత్తం మూడు భారీ చిత్రాలు..!

Published on Jan 21, 2022 8:00 PM IST


కరోనా వైరస్ మహమ్మారి విపత్తు కారణం గా గత రెండు సంవత్సరాలు గా భారీ చిత్రాల విడుదల కి ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. మెల్ల మెల్లగా తమ సినిమాలను విడుదల చేసేందుకు సరికొత్త విడుదల తేదీ లను వెతుకుతున్నాయి భారీ చిత్రాలు. అయితే సౌత్ నాట సెన్సేషన్ సృష్టించిన కేజీఎఫ్ చిత్రం కి సీక్వెల్ గా వస్తున్న కేజీఎఫ్2 విడుదల తేదీ ను ముందుగా ప్రకటించి తమ తేదీ ను రిజర్వ్ చేసుకుంది.

అదే తరహాలో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చద్ధా చిత్రం అదే ఏప్రిల్ 14 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. మరొకసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 14 కే విడుదల చేస్తున్నట్లు తెలిపింది. సౌత్ నుండి మరొక భారీ చిత్రం బీస్ట్. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కి విడుదల కావాల్సి ఉండగా, కరోనా కేసుల పెరుగుదల తో వాయిదా పడింది. ఈ చిత్రం కూడా ఏప్రిల్ 14 వ తేదీన విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మూడు భారీ చిత్రాలు ఓకే రోజున బాక్సాఫీస్ వద్ద ఢీ కొననున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు