‘పుష్ప’ కోసం ముఖ్య అతిథులుగా ముగ్గురు స్టార్ హీరోలు !

Published on Dec 6, 2021 3:09 pm IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా ‘పుష్ప’. కాగా ఈ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప- ది రైజ్‌’ డిసెంబర్‌ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఈ చిత్రం ప్రీ-రిలీజ్‌ వేడుకను గ్రాండ్ గా నిర్వహించబోతుంది. అయితే, ఈ వేడుకకు ఏకంగా ముగ్గురు స్టార్‌ హీరోలను ముఖ్య అతిథులుగా తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇంతకీ ఆ ముగ్గురు స్టార్ హీరోలు ఎవరు అంటే.. మెగాస్టార్ చిరంజీవి, అలాగే నేషనల్ స్టార్ ప్రభాస్‌. ప్రభాస్‌ ఎలాగూ ‘ఆదిపురుష్‌’ షూటింగ్‌ పూర్తి చేసుకొని తిరిగొచ్చాడు. అందుకే, అల్లు అర్జునే స్వయంగా ప్రభాస్‌ను ఆహ్వానించాడని తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్‌ కపూర్‌ ను కూడా పుష్ప ప్రీ-రిలీజ్‌ వేడుకకు ఆహ్వానిస్తున్నారు.

ప్రస్తుతం నాని నటించిన ‘జెర్సీ’ చిత్రాన్ని అల్లు అరవింద్‌.. దిల్‌ రాజుతో కలిసి షాహిద్‌ కపూర్‌ హీరోగా బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. కాబట్టి అల్లు అరవింద్‌ పిలిస్తే.. కచ్చితంగా షాహిద్‌ కపూర్‌ వస్తాడు. పుష్ప చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాకి తెరకెక్కిస్తున్నారు. అందుకే ఈ సినిమాకి పాన్ ఐడియా ఇమేజ్ తీసుకురావడానికి పాన్ ఇండియా స్టార్లను గెస్ట్ లు గా ఆహ్వానిస్తున్నారు.

సంబంధిత సమాచారం :