ఒకేరోజు రానున్న ముగ్గురు హీరోలు !

4th, November 2017 - 03:54:28 PM

తెలుగు సినిమాలు ఒక్కోసారి ఒకేరోజు మూడు, నాలుగు విడుదల కావడం చూసాం. మరోసారి అలాంటి సందర్భం మనం చూడబోతున్నాం. ఫిబ్రవరి 9 న ఒకే సారి మూడు సినిమాలు విడుదల అవుతున్నాయని సమాచారం. సాయి ధరమ్ తేజ్ & వి.వి.వినాయక్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫిబ్రవరి 9 న విడుదల కానుందని ముందే ప్రకటించారు. అదే రోజున మరో రెండు సినిమాలు రాబోతున్నాయి.

‘ఫిదా’ సినిమాతో మంచి హిట్ అందుకున్న హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వెంకీ అట్లూరి అనే యువ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 9 న విడుదల కానుందని ప్రకటించారు నిర్మాతలు. తాజా సమాచారం ప్రకారం బెల్లంకొండ శ్రీనివాస్ & డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న ‘సాక్షం’ సినిమా కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతోందని టాక్. ఒకే రోజు ముగ్గురు మంచి మార్కెట్ ఉన్న హీరోలు రావడం విశేషమే.