రవితేజ అభిమానులకు రేపు సిసలైన పండుగ…మూడు అప్డేట్స్ ఒకేరోజు!

Published on Jan 25, 2022 6:49 pm IST

మాస్ మహారాజా రవితేజ పుట్టిన రోజు సందర్భంగా రేపు ఒక్క రోజే మూడు చిత్రాలకు సంబందించిన అప్డేట్స్ రానున్నాయి. రవితేజ వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో బిజీ హీరోగా కొనసాగుతున్నారు. గతేడాది క్రాక్ చిత్రం తో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన మాస్ మహారాజా ఈ సంవత్సరం కూడా అదే జోరును కొనసాగించే విధంగా తన సినిమాలతో సిద్దం అవుతున్నారు.

రేపు మాస్ మహారాజా రవితేజ పుట్టిన రోజు సందర్భంగా, రవి తేజ హీరోగా నటిస్తున్న ఖిలాడి చిత్రం నుండి ఫుల్ కిక్కు సాంగ్ ను రేపు ఉదయం 10:08 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. అదే విధంగా రేపు మధ్యాహ్నం 12:06 గంటలకు రామారావు ఆన్ డ్యూటీ చిత్రానికి సంబంధించిన అప్డేట్ రానుంది. సాయంత్రం 4:05 గంటలకు ధమాకా చిత్రం కి సంబంధించిన అప్డేట్ రానుంది. ఈ అప్డేట్స్ తో మాస్ మహారాజా ఫ్యాన్స్ కు రేపు సిసలైన పండుగ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :