“రాధేశ్యామ్” ప్రీ రిలీజ్ వేడుకలో కిందపడ్డ కటౌట్.. ముగ్గురికి గాయాలు..!

Published on Dec 23, 2021 11:58 pm IST


ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్” ప్రీ రిలీజ్ వేడుక నేడు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరుగుతుంది. వేలాది మంది అభిమానులు హాజరైన ఈ వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. ప్రభాస్‌ని చూసేందుకు కొంత మంది అభిమానులు అక్కడే ఏర్పాటు చేసిన కృష్ణంరాజు కటౌట్ పైకి ఎక్కడంతో ఆ కటౌట్ కిందపడిపోయింది.

ఈ ఘటన్లో ముగ్గురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వేలాదిమంది అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.

సంబంధిత సమాచారం :