టాక్..చరణ్ – శంకర్ భారీ సినిమాకి మూడు టైటిల్స్..?

Published on May 25, 2022 2:45 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం మరో భారీ సినిమా ఇండియన్ టాప్ దర్శకుల్లో ఒకరైన శంకర్ తో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రాజమౌళితో చేసిన రౌద్రం రణం రుధిరం తర్వాత సినిమా కావడం పైగా శంకర్ సినిమా అవ్వడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అనేక అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమా టైటిల్ పై గత కొన్ని రోజులు నుంచి ఇంట్రెస్టింగ్ టాక్ లు కొన్ని వినిపిస్తూ వచ్చాయి.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా అయితే మేకర్స్ ఈ సినిమాకి గాను మూడు సాలిడ్ టైటిల్స్ ని టేకప్ చేసారట. అలాగే వీటిలో ఆల్రెడీ ఒక టైటిల్ ని మేకర్స్ కన్ఫర్మ్ చేసారట. అలాగే దీనిపై అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే దిల్ రాజు తమ బ్యానర్ లో 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :