‘మహేష్’ సినిమాలో థ్రిల్లింగ్ ఫైట్ సీన్ !

5th, August 2016 - 10:00:55 AM

mahesh-babu
సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అభిమానులకు కావలసిన అన్ని అంశాలు పుష్కలంగా ఉండేలా చూస్తున్నారు దర్శకుడు మురుగదాస్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో కీలకస్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

అందులో భాగంగానే నైట్ ఎఫెక్ట్ లో ఓ బ్రహ్మానందమైన ఫైట్ సీన్ తెరకెక్కిస్తున్నారట. ఈ ఫైట్ కోసం ప్రముఖ ఫైట్ మాస్టర్ ‘అనల్ అరసు’ పనిచేస్తున్నారట. ఈ ఫైట్స్ గురి చేస్తాయట. అరసు గతంలో శ్రీమంతుడు, బ్రూస్ లీ, జిల్ వంటి చిత్రాలతో పాటు పలు తమిళ, హిందీ చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేశారు. ఇకపోతే ఈ చిత్రంలో ‘రకుల్ ప్రీత్’ నటిస్తుండగా ‘ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు’ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.