భారీ నష్టాలను మిగిల్చిన థగ్స్ అఫ్ హిందుస్థాన్ !ఈఏడాది బాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటి గా నిలిచి ఇటీవల ప్రేక్షకులముందుకు వచ్చిన చిత్రం ‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’. విడుదలకు ముందు రికార్డులు బద్దలు కొడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. అనుకున్నట్లుగానే మొదటిరోజు 50కోట్లు రాబట్టి హిందీలో కొత్త రికార్డు సృష్టించింది. అయితే మొదటి షో నుండే డివైడ్ టాక్ రావడంతో రెండు రోజు నుండి చిత్ర కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. సుమారు 300కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం ఇప్పటివరకు కేవలం 143కోట్ల వసూళ్లను రాబట్టడంతో చిత్ర నిర్మాతలకు అలాగే డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవని సమాచారం.

అమీర్ ఖాన్, కత్రినా కైఫ్ , అమితాబ్ బచ్చన్ , ఫాతిమా సన షేక్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈచిత్రాన్ని విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కించాడు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Advertising
Advertising