టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ టైగర్ నాగేశ్వర రావు. ఈ చిత్రం కి సంబందించిన ప్రచార చిత్రాలు రిలీజై ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం కి సంబందించిన సెకండ్ సింగిల్ పై నేడు అప్డేట్ రానుంది.
సాయంత్రం 4:59 గంటలకు మేకర్స్ సెకండ్ సింగిల్ కి సంబందించిన అప్డేట్ ను రిలీజ్ చేయనున్నారు. నుపూర్ సనన్, అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జీషు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.