జెట్ స్పీడ్ షూట్ లో “టైగర్ నాగేశ్వరరావు” షూటింగ్.!

Published on Apr 15, 2022 1:30 pm IST


మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రస్తుతం పలు సాలిడ్ ప్రాజెక్ట్ లు హీరోగా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకదానికి ఒకటి డిఫరెంట్ సబ్జెక్టు తో దేనికదే షూటింగ్ ని శరవేగంగా చేస్తూ మాస్ మహారాజ వాటిని పూర్తి చేసేస్తున్నారు. మరి వీటిలో రీసెంట్ గా స్టార్ట్ అయ్యిన భారీ సినిమా “టైగర్ నాగేశ్వర రావు” షూట్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది.

మొన్ననే “రావణాసుర” షూట్ లో పాలొన్న మాస్ మహారాజ్ ఇప్పుడు టైగర్ నాగేశ్వర్ లో పాల్గిన్నటు అందులోని ఒక నైట్ టైం షూట్ తాము చేస్తున్నట్టు చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఇక ఈ సినిమాకి దర్శకుడు వంశీ వర్క్ చేస్తుండగా మేకర్స్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. అలాగే నపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :