‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్ రిలీజ్ టైం ముహూర్తం ఫిక్స్ ?

Published on May 23, 2023 7:58 pm IST


మాస్ మహారాజా రవితేజ హీరోగా నుపూర్ సనన్ హీరోయిన్ గా తాజాగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. యువ దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకోగా దీనిని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ యొక్క ఫస్ట్ లుక్ లాంచింగ్ ఈవెంట్ ని రేపు రాజమండ్రి హేవ్ లాక్ బ్రిడ్జి మీద గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్నారు.

ఈ లుక్ ని తెలుగు నుండి వెంకటేష్, హిందీ నుండి జాన్ అబ్రహం, మలయాళం నుండి దుల్కర్, కన్నడ నుండి శివరాజ్ కుమార్, తమిళ్ నుండి కార్తీ కార్తీ రిలీజ్ చేయనున్నారు. కాగా మ్యాటర్ ఏమిటంటే, రేపు సాయంత్రం సరిగ్గా 3 గం. 6 ని. లకు టైగర్ నాగేశ్వరావు లుక్ రిలీజ్ కి పక్కాగా టైం ఫిక్స్ చేసినట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేసారు. భారీ యాక్షన్ తో కూడిన మాస్ మూవీగా రూపొందిన టైగర్ నాగేశ్వరరావు లో రేణు దేశాయ్ కీలక పాత్ర చేస్తుండగా దీనిని అక్టోబర్ 20న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :