“టైగర్ నాగేశ్వరరావు” ట్రైలర్..ఫ్యాన్స్ కే వదిలేసిన నిర్మాత

Published on Sep 20, 2023 7:02 am IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నపూర్ సనన్ హీరోయిన్ గా దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న భారీ పానిండియా చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ అంతకంతకూ హైప్ ని పెంచుకుంటూ వెళ్తుంది. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ టీజర్, సాంగ్స్ అదరగొట్టగా ఇక అంతా ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ అవైటెడ్ ట్రైలర్ పై అయితే ఛాయిస్ ఫ్యాన్స్ కే వదిలేశారు నిర్మాత అభిషేక్ అగర్వాల్.

తన ట్విట్టర్ ఖాతా ద్వారా రెండు డేట్స్ పెట్టి ఏ డేట్ ట్రైలర్ కావాలి అనుకుంటున్నారు అని పోల్ ద్వారా అడగ్గా ఎక్కువమంది అయితే ఈ సెప్టెంబర్ 27 కే వోట్ వేశారు. దీనితో ఇదే సరైన సమయం అని అప్పుడు వచ్చే అన్ని సినిమాలతో ట్రైలర్ ని అటాచ్ చేసి రిలీజ్ చేస్తే పాన్ ఇండియా వైడ్ సినిమాకి మరింత బూస్టప్ వస్తుంది అని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి మేకర్స్ ఇదే డేట్ లో ఫ్యాన్స్ రెస్పాన్స్ ని గౌరవించి రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :