ఈ వర్క్ లో ఫుల్ బిజీగా “టైగర్ నాగేశ్వరరావు” యూనిట్.!

Published on Sep 12, 2023 4:05 pm IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా బాలీవుడ్ నటి నుపుర్ సనన్ హీరోయిన్ గా దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం ఆల్రెడీ దసరా రిలీజ్ కోసం సంసిద్ధం అవుతుండగా రవితేజ కెరీర్ లోనే గట్టి హైప్ ఇప్పుడు దీనిపై నెలకొంది. ఇక ఈ చిత్రం పట్ల మేకర్స్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉండగా ప్రస్తుతం అయితే మూవీ టీం అంతా కూడా సినిమా వి ఎఫ్ ఎక్స్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారట.

ప్రస్తుతం చెన్నై నుంచి ఓ బృందం అలాగే ముంబై నుంచి ఓ బృందం ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల్లో ఉన్నారట. దీనితో వీలైనంత బెటర్ అవుట్ పుట్ ని అందించనున్నారని ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పటికే సినిమా టీజర్ విషయంలో ఒక్క ఈ గ్రాఫిక్స్ మినహా ఇంకో మైనస్ అయితే ఎక్కడా అనిపించలేదు. మరి ఇది కూడా పర్ఫెక్ట్ గా చేస్తే మాత్రం డెఫినెట్ గా పాన్ ఇండియా వైడ్ టైగర్ నాగేశ్వరరావు హంట్ మామూలుగా ఉండదు అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :