క‌త్రినా – విక్కీ కౌగిలింత.. వైరల్ అవుతోన్న వీడియో !

Published on Oct 17, 2021 9:09 pm IST

బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ – బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రినా కైఫ్ ప్రేమలో ఉన్నారని.. ఇప్పటికే వీరి నిశ్చితార్థం కూడా అయిపోయింది అంటూ పలు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ మధ్య వీరి నిశ్చితార్థం ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోల్లో నిజం లేదు అని ఆ తర్వాత కత్రినా క్లారిటీ ఇచ్చింది. తాజాగా విక్కీ కౌశల్ – క‌త్రినా కైఫ్ టైట్ గా కౌగిలించుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైర‌ల్‌ అవుతుంది.

విక్కీ హీరోగా వచ్చిన కొత్త సినిమా ‘స‌ర్దార్ ఉద్దం’. అయితే, ఈ చిత్రం ప్రీమియ‌ర్ షోకి క‌త్రినా గెస్ట్‌ గా వ‌చ్చింది. ఇక సినిమా చూసిన తర్వాత క‌త్రినా తన బాయ్‌ ఫ్రెండ్‌ ని గట్టిగా హ‌గ్ చేసుకుంది. అయితే ప్రస్తుతం ఈ వీడియోనే వైర‌ల్‌గా మారింది. మొత్తానికి ఈ వీడియో వారి రిలేష‌న్‌షిప్ కి సాక్ష్యంగా అయింది అన్నమాట.

ఇక విక్కీ కౌశల్ కి 33 ఏళ్ళు. అదే కత్రినాకి 39 ఏళ్ళు. 5 ఏళ్ళు చిన్నవాడు అయినా అతనితో ప్రేమలో పడింది కత్రినా.

సంబంధిత సమాచారం :