లేటెస్ట్: టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Jun 5, 2023 5:01 pm IST

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సూపర్ హిట్ మూవీ డీజే టిల్లుకి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ షూటింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ముందుగా ప్రకటించినట్లుగా, మేకర్స్ ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన అప్డేట్‌ను వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం సెప్టెంబర్ 15, 2023న ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్క్రీన్‌లలోకి రానుందని ధృవీకరించబడింది.

అదే విషయాన్ని ప్రకటించడానికి సరికొత్త పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. మల్లిక్ రామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ ఫన్ ఫుల్ థ్రిల్లర్‌లో బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యాంక్రోల్ చేసిన ఈ క్రేజీ మూవీలో చాలా మంది ప్రముఖ నటీనటులు కూడా ఉన్నారు. ఈ చిత్రానికి రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :