ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో క్రేజీ సూపర్ హీరో చిత్రమే “మహాకాళి”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన ఈ లేడీ సూపర్ హీరో సినిమాకి పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ అవైటెడ్ సినిమా నుంచి రీసెంట్ గానే మేకర్స్ వెర్సటైల్ నటుడు అక్షయే ఖన్నా పై సాలిడ్ పోస్టర్స్ వదులుతూ రేపు సినిమా తాలూకా గ్లింప్స్ ని లాక్ చేసారు.
అయితే ఫైనల్ గా ఈ గ్లింప్స్ రిలీజ్ కి టైం ని ఇప్పుడు రివీల్ చేసారు. రేపు ఉదయం 11 గంటల 34 నిమిషాలకి అక్షయే పై సాలిడ్ గ్లింప్స్ వదులుతున్నట్టు అప్డేట్ అందించిన పోస్టర్ తోనే సినిమా ఓటీటీ పార్ట్నర్ పై కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నారు. ఇంకా ఎలాంటి కంటెంట్ రాకుండానే నెట్ ఫ్లిక్స్ లాంటి ప్లాట్ ఫామ్ ఈ సినిమాని సొంతం చేసుకోవడం విశేషం. సో రేపు వచ్చే గ్లింప్స్ ఎలా ఉంటుందో చూడాలి.
#AkshayeKhanna – Shukracharya’s War Cry out Tomorrow, 24th August at 11:34 AM ❤️🔥
Directed by @PujaKolluru
Presented by #RKDuggal
Produced by #RiwazDuggal @RKDStudios@ThePVCU @sriyareddy #BhoomiShetty #RohitSaraf @khushsundar #RakeshBedi @thondankani @jitin0804 #RajatKapoor… pic.twitter.com/L9eA39BzZ7— Prasanth Varma (@PrasanthVarma) August 23, 2026
