“సర్కారు వారి” సూపర్ మాస్ ట్రీట్ కి సమయం ఆసన్నం.!

Published on Apr 16, 2022 8:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోనే భారీ అంచనాలతో తెరకెక్కుతున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట”. అటు మాస్ ఇటు క్లాస్ అండ్ స్టైలిష్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల చాలా కేర్ తీసుకొని చేసిన ఈ మాస్ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.

దీనితో ఈ మాసివ్ ప్రాజెక్ట్ పై కనీ వినీ ఎరుగని అంచనాలు నెలకొన్నాయి. అయితే మరి ఈ సినిమా నుంచి ఇంకా ఓ పక్కా మాస్ ట్రీట్ కోసం ఆడియెన్స్ సహా అభిమానులు చాలా ఆసక్తిగా ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలని మేకర్స్ రిలీజ్ చేసారు. అవి చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

ఇక మూడో సాంగ్ మాస్ సాంగ్ కోసం ఎదురు చూస్తుండగా సంగీతం దర్శకుడు థమన్ లేటెస్ట్ గా పెట్టిన ట్వీట్ తో అయితే ఈ సూపర్ మాస్ ట్రీట్ కి ఎంతో సమయం లేదనే అనిపిస్తుంది. అతి త్వరలోనే ఈ ట్రీట్ టేకాఫ్ అవుతుందని తెలుపుతున్నాడు. దీనితో ఈ క్రేజీ సాంగ్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :