“ఆదిపురుష్” టీజర్ గ్రాండ్ రిలీజ్ కి కూడా టైం ఫిక్స్.!

Published on Sep 30, 2022 8:10 am IST

ఈరోజు ఉదయమే ఇండియన్ సినిమా దగ్గర మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక మోస్ట్ ఎనర్జిటిక్ మార్నింగ్ అని చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ సినిమా “ఆదిపురుష్” నుంచి టీజర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మాసివ్ అప్డేట్ ఈరోజుకి నెరవేరింది.

స్టన్నింగ్ పోస్టర్ తో సినిమాపై అంచనాలు వేరే లెవెల్ కి తీసుకెళ్లిన మేకర్స్ దీనితో పాటుగా అయితే టీజర్ రిలీజ్ టైం ని కూడా లాక్ చేసేసారు. మరి ఈ పోస్టర్ ని ఈరోజు ఉదయం 7 గంటల 11 నిమిషాలకి రిలీజ్ చెయ్యగా అవైటెడ్ టీజర్ ని అయితే ఈ అక్టోబర్ 2న సాయంత్రం 7 గంటల 11 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టు క్రేజీ అప్డేట్ అందించారు. మొత్తానికి అయితే ఈ సెన్సేషనల్ టీజర్ ఎలాంటి విజువల్స్ తో ఉండనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :