లేటెస్ట్..”ఉగ్రం” టీజర్ కి డేట్, టైం ఫిక్స్.!

Published on Feb 21, 2023 10:53 am IST

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోస్ లో అల్లరి నరేష్ కూడా ఒకరు. మరి మొదటి నుంచి కామెడీ సినిమాలు చేస్తూ వచ్చి ఇప్పుడు నటుడుగా కూడా పలు ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ తాను వెర్సటైల్ నటుడుగా పరిణితి చెందారు. అలా తాను చేస్తున్న లేటెస్ట్ సినిమానే “ఉగ్రం”. అల్లరి నరేష్ లాస్ట్ హార్డ్ హిట్టింగ్ హిట్ సినిమా “నాంది” దర్శకుడు విజయ్ కనక మేడల తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై కూడా ప్రామిసింగ్ అంచనాలు ఉన్నాయి.

మరి ఈ చిత్రంలో కూడా అల్లరి నరేష్ ఓ సీరియస్ రోల్ ప్లే చేస్తుండగా మేకర్స్ అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు టీజర్ పై సాలిడ్ అప్డేట్ ని అందించారు. మరి ఈ సినిమా టీజర్ ని అయితే ఈ ఫిబ్రవరి 22న ఉదయం 11 గంటల 34 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి వీరి కాంబినేషన్ నుంచి లాస్ట్ టైం వచ్చిన నాంది కి టీజర్ విపరీతమైన బజ్ తీసుకొచ్చింది. మరి ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకల సంగీతం అందిస్తుండగా మిర్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :