“పుష్ప” మరో మాస్ నెంబర్ ప్రోమో కి టైం ఫిక్స్.!

Published on Nov 16, 2021 10:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ సినిమా “పుష్ప ది రైజ్”. ఒక్కో అప్డేట్ తో మరింత హైప్ పెంచుకుంటూ వెళ్తున్న ఈ భారీ చిత్రం నుంచి రీసెంట్ గా మరిన్ని అప్డేట్స్ చిత్ర యూనిట్ ఇచ్చారు. వరుసగా రెండు పాటల అప్డేట్స్ ఇవ్వగా ఇందులో నాలుగో సాంగ్ అందులోని మరో మాస్ బీట్ “ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా” సాంగ్ కూడా ఒకటి. మరి దీని ప్రోమోకి మేకర్స్ టైం ఫిక్స్ చేసేసారు.

ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి దీనిని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనిపై సాలిడ్ అంచనాలు ఉన్నాయి పైగా అల్లు అర్జున్ కి ఫెవరెట్ సాంగ్ అని కూడా అంటున్నాడు. పూర్తిగా డిఫరెంట్ గా కనిపిస్తున్న అల్లు అర్జున్ ఈ సాంగ్ కి ఎలాంటి డాన్స్ దేవిశ్రీ ప్రసాద్ ఎలాంటి బీట్స్ ఇచ్చాడు అనేవే ఆసక్తిగా మారాయి. వాటిపై కొంచెం క్లారిటీ అయితే ఈరోజు సాయంత్రం వచ్చేస్తుంది అప్పుడు వరకు ఎదురు చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :