“అవతార్ 2” ట్రైలర్ రిలీజ్ కి టైం ఖరారు.!

“అవతార్ 2” ట్రైలర్ రిలీజ్ కి టైం ఖరారు.!

Published on Nov 2, 2022 1:00 PM IST

ఇప్పుడు ప్రపంచ సినిమా అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “అవతార్ 2”. జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన ఈ విజువల్ ట్రీట్ కోసం ఎప్పుడెప్పుడా అని ఆడియెన్స్ ఆసక్తిగా ఉన్నారు. మరి అవతార్ కి సీక్వెల్ గా “అవతార్ ది వే ఆఫ్ వాటర్” నుంచి ట్రైలర్ రిలీజ్ చెయ్యడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు గత కొన్ని రోజులు నుంచి వార్తలు వినిపిస్తుండగా నిన్న రాత్రి వాటిని కన్ఫర్మ్ చేస్తూ మేకర్స్ అధికారికంగా ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇక మన దేశంలో ఈ ట్రైలర్ ఏ టైం లో అందుబాటులో ఉంటుంది అనేది కూడా ఆసక్తిగా మారగా ఇప్పుడు దీనిపై అయితే క్రేజీ ఇన్ఫో బయటకి వచ్చింది. మన దేశంలో ఈ చిత్రం ట్రైలర్ సాయంత్రం నాలుగున్నర తర్వాత నుంచి అందుబాటులో ఉండనుంది అని కన్ఫర్మ్ అయ్యింది. దీనితో ఇక ఆడియెన్స్ అంతా ఆ సమయం కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరి విజువల్ గా అవతార్ కన్నాల ఎన్నో రేట్లు మెరుగ్గా తెరకెక్కించిన ఈ చిత్రం అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ డిసెంబర్ 16 న రిలీజ్ నెవర్ బిఫోర్ లెవెల్లో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు