“వీరమల్లు” రీస్టార్ట్ ఎప్పుడో కన్ఫర్మ్ చేసిన క్రిష్.!

Published on Oct 5, 2021 5:00 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం సాలిడ్ రీమేక్ భీమ్లా నాయక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ దానికన్నా ముందే విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో భారీ లెవెల్లో ప్లాన్ చేసిన చిత్రం “హరిహర వీరమల్లు”. నిజానికి మొదటి నుంచి ఈ సినిమాపై ఉన్న హైప్ ఇంకో స్థాయిలో ఉంది. అయితే దాదాపు 60 శాతం అలా కంప్లీట్ అయ్యిన ఈ చిత్రం విరామంలో ఉంది.

ఇక ఈ గ్యాప్ లో క్రిష్ మెగా సెన్సేషనల్ హీరో వైష్ణవ్ తో “కొండ పొలం” అనే సినిమాని కంప్లీట్ చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో వీరమల్లు షూట్ మళ్ళీ ఎప్పుడు నుంచి ఉంటుంది అనేదానిపై అప్డేట్ ఇచ్చారు. దాని ప్రకారం ఈ చిత్రం మళ్ళీ వచ్చే నవంబర్ రెండో వారం నుంచి షురూ కానుందట.

అంతే కాకుండా అనుకున్న సమయానికే ఈ చిత్రాన్ని భారీ లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :