హృతిక్ “ఫైటర్” ట్రైలర్ కి టైం ఫిక్స్.!

హృతిక్ “ఫైటర్” ట్రైలర్ కి టైం ఫిక్స్.!

Published on Jan 14, 2024 4:17 PM IST


బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరోగా దీపికా పదుకోన్ హీరోయిన్ గా బాలీవుడ్ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఫైటర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం బాలీవుడ్ ఆడియెన్స్ సహా యాక్షన్ మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ చిత్రం ఇది వరకే టీజర్ తో అయితే మంచి రెస్పాన్స్ ని అందుకుంది.

ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి అవైటెడ్ ట్రైలర్ కట్ పై అప్డేట్ బయటకి వచ్చింది. మేకర్స్ ఈ చిత్రం ట్రైలర్ ని రేపు జనవరి 15న మధ్యాహ్నం 12 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టుగా ఫిక్స్ చేశారు. మరి ఈ ట్రైలర్ మాత్రం ఎలా ఉంటుందో చూడాలి. ఇక ప్రస్తుతానికి ఈ చిత్రం కేవలం హిందీ రిలీజ్ కి మాత్రమే స్టిక్ అయ్యి ఉండగా పాన్ ఇండియా రిలీజ్ కూడా ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై ట్రైలర్ తో ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు