ఓజీ: హంగ్రీ చీతా సాంగ్ కి టైమ్ ఫిక్స్!

Published on Sep 3, 2023 2:50 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో రూపొందుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ. ఈ చిత్రం కి సంబందించిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో ను నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియో ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంది. సోషల్ మీడియా లో సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. అయితే గ్లింప్స్ వీడియో లో వచ్చినటువంటి హంగ్రీ చీతా కి సంబందించిన సాంగ్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ హంగ్రీ చీతాను ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :