తారక్ ఆ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యేది అప్పుడేనా?

Published on Mar 13, 2022 6:26 pm IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ గా నటించిన భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” విడుదలకి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ భారీ సినిమా అనంతరం తారక్ నుంచి మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు ఒకదాని తర్వాత ఒకటి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ చిత్రాల్లో ఆల్రెడీ రెండు సాలిడ్ ప్రాజెక్ట్ లు అనౌన్స్ కాగా మరొకటి అనౌన్స్ కావాల్సి ఉంది.

ఇపుడు దానిపైనే మరింత ఆసక్తి నెలకొంది. లేటెస్ట్ గా టాలీవుడ్ లో “ఉప్పెన” సినిమాతో అదిరే డెబ్యూ ఇచ్చి మొదటి సినిమా తోనే 100 కోట్లు అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సాన. మరి ఈ దర్శకుడి తోనే తారక్ ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో సినిమా చేయనున్నాడు.

అలాగే ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ చేయనున్నారని టాక్ కూడా ఉంది. మరి వీరి నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అధికారిక అనౌన్సమెంట్ ఈ ఏప్రిల్ మిడ్ లో వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :