లేటెస్ట్..”లవ్ స్టోరీ” ట్రైలర్ లాంచ్ కి టైం ఫిక్స్!

Published on Sep 12, 2021 11:45 am IST


ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి అంచనాలతో ఎప్పుడు నుంచో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో “లవ్ స్టోరీ” కూడా ఒకటి. నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం ఎప్పుడు నుంచో మోస్ట్ అవైటెడ్ గా ఉంది. మరి పలు మార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం గత రెండు రోజులు కితం వినాయక చవితి సందర్భంగా రిలీజ్ కావాల్సి ఉంది.

కానీ పలు కారణాల చేత అది మరో తేదీకి మారింది. ఇక ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ కి టైం ఫిక్స్ చేసారు. రేపు సెప్టెంబర్ 13 ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే వచ్చిన టీజర్ పాటలు అన్నిటికీ కూడా భారీ రెస్పాన్స్ రావడంతో అంతే స్థాయి హైప్ ఉంది. ఇక ఈ ట్రైలర్ కూడా చూస్తే సినిమాపై ఒక అంచనా వస్తుంది. మరి ఇదెలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :