“పుష్ప” రాజ్ లో మాస్ వెర్షన్ కి టైం ఫిక్స్.!

Published on Oct 26, 2021 12:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “పుష్ప ది రైజ్” కోసం అందరికీ తెలిసిందే. రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ చిత్రంలో మొదటి భాగంపైనే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలోని సాంగ్స్ ఒక్కొక్కటిగా చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఒక వైల్డ్ సాంగ్ తర్వాత లవ్ సాంగ్ రాగా ఇప్పుడు పుష్ప, శ్రీవల్లి లకు కలిపి ప్లాన్ చేసిన మాస్ నెంబర్ ‘సామి సామి’ కి టైం ఫిక్స్ అయ్యింది. నిన్న ఎలాంటి హడావుడి లేకుండా అనౌన్స్ చేసిన ఈ ప్రోమోకే భారీ రెస్పాన్స్ వచ్చేసింది.

ఇక ఇప్పుడు ఈ ఫుల్ సాంగ్ రిలీజ్ కి డేట్ అండ్ టైం ని మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ సాంగ్ ని వచ్చే అక్టోబర్ 28న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా డిసెంబర్ 17 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

More