“పుష్ప” మోస్ట్ అవైటెడ్ అప్డేట్ టైం ఫిక్స్ చేసిన టీం!

Published on Oct 5, 2021 11:28 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుమారు కాంబోలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ఆల్రెడీ చార్ట్ బస్టర్ కాగా దేవి, సుకుమార్ బన్నీ కాంబోలో ఎన్నో అంచనాలు ఉన్న మెలోడీ సాంగ్ ‘శ్రీవల్లి’. ఎప్పుడు నుంచో ఈ స్పెషల్ సాంగ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా కాస్త లేట్ అయినా మేకర్స్ ఈ అప్డేట్ ని ఎట్టకేలకు ఇచ్చేసారు.

తమ పుష్ప రాజ్ మనసును దోచుకున్న శ్రీవల్లి ఇప్పుడు ఆడియెన్స్ మనసు దోచుకోవడానికి వస్తుంది రెడీగా ఉండమని చెప్తున్నారు. మరి ఈ సాంగ్ ని వచ్చే అక్టోబర్ 13 న ముందు సాంగ్ లాగే ఐదు భాషల్లో ఒకేసారి లాంచ్ చేస్తున్నట్టు అర్ధం అవుతుంది. మరి ఈ మ్యాజికల్ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే అప్పుడు వరకు ఆగక తప్పదు. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తీస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :