“రాధే శ్యామ్” చార్ట్ బస్టర్ రిలీజ్ కి టైం ఫిక్స్.!

Published on Feb 25, 2022 10:15 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా సినిమా అంతకంతకూ మంచి హైప్ ని పెంచుకుంటూ వెళ్తుంది. ఇక రీసెంట్ గానే ఈ సినిమాలోని మరో సాంగ్ కి సంబంధించి మేకర్స్ అప్డేట్ ని కూడా రివీల్ చేశారు. అయితే ఇది తెలుగులో ఆల్రెడీ విన్నదే అయినా హిందీలో మాత్రం కొత్త సాంగ్.

కాగా ఈ సాంగ్ ని రిలీజ్ చెయ్యడానికి ముందు అన్ని భాషల్లో కూడా ప్రోమోస్ ని రిలీజ్ చెయ్యగా వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక మన తెలుగులో అయితే ఆల్రెడీ చార్ట్ బస్టర్ అయ్యిన ఈ సాంగ్ కొత్త వెర్షన్ ని ఈరోజు మధ్యాహ్నం అన్ని భాషల్లో 12 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు అనౌన్స్ చేశారు. అయితే వీటిలో అయితే హిందీ సాంగ్ కోసం అంతా అధికంగా ఎదురు చూస్తున్నారు. మరి విజువల్ గా జస్టిన్, మిథున్, మనన్ భరద్వాజ్ లు ఇచ్చిన సంగీతం ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :