ఓటిటిలో సాయి పల్లవి “గార్గి” స్ట్రీమింగ్ కి టైం ఫిక్స్.?

ఓటిటిలో సాయి పల్లవి “గార్గి” స్ట్రీమింగ్ కి టైం ఫిక్స్.?

Published on Jul 27, 2022 8:00 AM IST


లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం “గార్గి” కోసం అందరికీ తెలిసిందే. సాయి పల్లవి కెరీర్ లో ఒక బెస్ట్ వర్క్ గా మాత్రమే కాకుండా తన నుంచి ఫస్ట్ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాగా వచ్చిన ఈ చిత్రం మంచి స్పందనను అన్ని భాషల్లో అందుకుంది.

దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కగా ఎమోషనల్ హిట్ అయ్యి తమిళ్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి సంస్థ సోని లివ్ వారు అన్ని భాషల్లో కొనుగోలు చేయగా ఆగస్ట్ రెండో వారం నుంచి అయితే అందులో స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అయితే ఇంకా అధికారిక డేట్ అనౌన్స్ కావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు