సమంతా, విజయ్ దేవరకొండ ల సినిమా ఫస్ట్ లుక్ కి టైం ఫిక్స్.!

Published on May 15, 2022 12:57 pm IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్ లు విజయ్ దేవరకొండ అలాగే సమంతా లు లేటెస్ట్ మళ్ళీ ఒక సారి స్క్రీన్ ని పంచుకోనున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రామిసింగ్ సినిమాలతో మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించే దర్శకుడు శివ నిర్వాణ కాంబోలో ఈ ఇద్దరు లేటెస్ట్ గా ఒక సినిమాకి కమిట్ అయ్యారు. అయితే గత కొన్ని రోజులు కితమే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.

మరి రేపు మే 16న డేట్ లాక్ చెయ్యగా ఇప్పుడు దానికి టైం ని కూడా అనౌన్స్ చేశారు. మరి దీని ప్రకారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. మరి అదెలా ఉంటుందో చూడాలి. అలాగే ఇది వరకే సామ్ మరియు విజయ్ దేవరకొండ లు “మహానటి” సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోగా ఈసారి ఎలా ఉంటుందో అని వారి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :