“సర్కారు వారి పాట” ఒరిజినల్ సాంగ్ రిలీజ్ కి టైం ఫిక్స్!

Published on Feb 13, 2022 12:50 pm IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” నుంచి మేకర్స్ ఒక్కో అప్డేట్ ని ప్లాన్ ప్రకారం డీల్ చేస్తూ రిలీజ్ చేస్తూ వస్తుండగా ఫస్ట్ సింగిల్ విషయంలో వారికి ఊహించని షాక్ తగిలింది. అనుకున్న దానికంటే ముందే సాంగ్ లీక్ అయ్యి షాక్ ఇవ్వగా మేకర్స్ మరియు సంగీత దర్శకుడు థమన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక దీనితో ఈ సాంగ్ ని కాస్త ముందే రిలీజ్ చేస్తున్నామని అది కూడా ఈరోజే ఉంటుంది అని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ‘కళావతి’ ఒరిజినల్ బీట్ ని ఈరోజు ఫిబ్రవరి 13 సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు అధికారికంగా విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ ఒరిజినల్ ఎక్స్ పీరియన్స్ కోసం మహేష్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మే 12న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :