“సర్కారు వారి పాట” మాస్ బొనాంజా.. ట్రైలర్ రిలీజ్ కి టైం ఫిక్స్.!

Published on May 1, 2022 4:06 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తో మహేష్ బాబు ఫస్ట్ టైం చేసిన సినిమా ఇది కావడం పైగా తన గత సినిమాలకు మించిన క్రేజీ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కడంతో మహేష్ ఫ్యాన్స్ లో హైప్ వేరే లెవెల్లో ఈ సినిమాపై ఉంది.

ఇక రేపు రాబోతున్న ట్రైలర్ విషయంలో అయితే వారు మరింత ఎగ్జైటింగ్ గా ఉండగా ఈ మాస్ ట్రైలర్ అందించే బొనాంజా ఏ సమయానికి లాక్ అయ్యింది అనే దానిపై మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్ గా మేకర్స్ ఇప్పుడు ఆ టైం ని రివీల్ చేసేసారు.

ఈ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ని రేపు మే 2న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసేసారు. అలాగే దీనిని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన చిన్న మాస్ వీడియో కూడా అదిరిపోయింది. ఇక మహేష్ ఫ్యాన్స్ అయితే ఈ సమయానికి సిద్ధం అవుతున్నారు. మరి ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించగా మే 12న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :