లేటెస్ట్..సూర్య “ఈటి” మాస్ తెలుగు టీజర్ కి టైం ఫిక్స్.!

Published on Feb 19, 2022 12:03 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఈటి”. దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. దీనితో భారీ అంచనాలు ఈ చిత్రంపై నెలకొన్నాయి. మరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా టీజర్ ని మేకర్స్ మొదటగా తమిళ్ ని నిన్న రిలీజ్ చెయ్యగా దానికి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ టీజర్ ని తెలుగు సహా మిగతా భాషల్లో రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ టైం ఫిక్స్ చేశారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకి గాను ఈ టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. తమిళ్ లో అయితే అదిరిపోయిన ఈ టీజర్ తెలుగులో ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి ఇమాన్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :