వలిమై ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టైమ్ ఫిక్స్

Published on Feb 22, 2022 12:31 pm IST


కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ రాబోయే యాక్షన్ ఎంటర్‌టైనర్, వలిమై, ఫిబ్రవరి 24, 2022న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దానికంటే ముందుగా, భారీ బడ్జెట్ సినిమా నిర్మాతలు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ని నిర్వహించాలని ప్లాన్ చేశారు. తాజా వార్తల ప్రకారం, వలిమై తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.

ఈ రోజు పార్క్ హయత్ హోటల్‌ లో సాయంత్రం 6 గంటల నుంచి గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో తెలుగు నటుడు కార్తికేయ విలన్‌గా నటించారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రంలో హుమా ఖురేషి, సుమిత్ర, యోగి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమాని హిందీ, కన్నడ భాషల్లో కూడా అదే రోజు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :